బంగ్లాదేశ్ కు ఎవరూ వెళ్లవద్దు
హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
ఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్ దేశానికి వెళ్ల వద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్కార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే భారత రాయబార కార్యాలయంలో తెలియ చేయాలని స్పష్టం చేసింది కేంద్రం.
భారత రాయ బారి 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపింది. బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలను ఎప్పటికప్పుడు భారత దేశం గమనిస్తూ వస్తోందని పేర్కొంది. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది.
అయితే అప్రమత్తంగా ఉండటం ఇప్పుడు ముఖ్యమని వెల్లడించింది కేంద్రం. పౌరులందరూ చాలా జాగ్రత్తంగా , అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు పరిమితం కావాలని సూచించింది. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తో ఫోన్ లో మాట్లాడారు.