ప్రముఖ జావెలిన్ త్రో అథ్లెట్
భారత దేశానికి చెందిన జావెలిన్ త్రోయర్ అథ్లెట్ నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండానే ఒక్కటయ్యారు. సోనిపట్ కు చెందిన అమ్మాయితో వివాహం చేసుకున్నాడు. తను ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. ఆమె అక్కడ చదువుకుంటోంది. వారిద్దరూ హానీమూన్ కోసం దేశం విడిచి వెళ్లారు.
నీరజ్ చోప్రా తన వివాహానికి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్షణానికి మమ్మల్ని కలిపిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞతలు. ప్రేమతో బంధించబడి, సంతోషంగా ఎప్పటికీ. నీరజ్, హిమానీ అంటూ పేర్కొన్నాడు.
నీరజ్ మ్యారేజ్ గురించి తన మామ భీమ్ వెల్లడించారు. పెళ్లి రెండు రోజుల కిందట దేశంలోనే జరిగిందని చెప్పాడు. తను ప్రస్తుతం హర్యానా లోని పానిపట్ సమీపంలోని ఖంద్రా అనే గ్రామంలో ఉన్నాడు.
ఇదిలా ఉండగా పారిస్ లో నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో తన రెండవ పతకాన్ని గెలుచుకున్న నెలల తర్వాత ఈ వివాహం జరగడం విశేషం. టోక్యోలో జరిగిన 2021 ఎడిషన్ లో స్వర్థం సాధించాడు.