ఫైనల్ లో నేపాల్ ను ఓడించి రికార్డ్
ఢిల్లీ – తొలిసారిగా జరిగిన ఖో ఖో ప్రపంచ కప్ ను భారత మహిళలు గెలుచుకున్నారు. ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ ను ఓడించి రికార్డ్ సృష్టించారు. వీరితో పాటు పురుషుల ఖోఖో టీం కూడా చరిత్ర సృష్టించింది. ఈ జట్టు కూడా విజేతగా నిలిచింది. కప్ స్వంతం చేసుకుంది. నేపాల్ ను 78-40 తేడాతో ఓడించారు. టోర్నీ మొత్తంగా భారత జట్టు ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడి పోకుండా అజేయంగా నిలిచింది.
ఫైనల్‌లో కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే జట్టును ముందుండి నడిపించింది. మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది.
ఆరంభం నుంచి భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. నేపాల్ పై పైచేయి సాధించింది. ఆధిపత్య విజయంలో కీలక పాత్ర పోషించిన అన్షు కుమారి , చైత్ర ఈ పెద్ద రోజున భారత జట్టులో స్టార్లుగా నిలిచారు.
గ్రూప్ దశలో దక్షిణ కొరియా, ఇరాన్, మలేషియాపై ఘన విజయాలు సాధించింది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ పై గెలుపొందింది. సెమీ ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాపై ఆధిపత్య విజయం సాధించడం ద్వారా భారతదేశం కీర్తి మార్గంలో నిలిచింది.
ఇక టోర్నీ పరంగా ఉత్తమ అటాక్ ప్లేయర్ గా భారత జట్టుకు చెందిన అన్షు కుమారి , ఉత్తమ డిఫెండర్ గా నేపాల్ కు చెందిన మన్మతి ధని, ఉత్తమ క్రీడాకారిణిగా బి. చైత్ర ఎంపికయ్యారు.