వెల్లడించిన సీఈసీ
న్యూఢిల్లీ – దేశమంతటా ఎన్నికల నగారా మోగింది. ఇక ఇవాల్టి నుంచి ఎన్నికల కోడ్ అమలు లోకి రానుంది. అధికారికంగా ఏ ఒక్క జీవో తీసుకు వచ్చేందుకు వీలు లేదని స్పష్టం చేశారు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.
జూన్ 16 తేదీ లోపు ఎన్నికలను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కొత్తగా యువతీ యువకులు 1.8 కోట్ల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని చెప్పారు.
మొత్తం దేశంలో 98 కోట్ల మంది ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించు కోనున్నట్లు స్పష్టం చేశారు సీఈసీ. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
మొత్తం ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పారు సీఈసీ. 55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. కోటి 82 లక్షల మంది కొత్తగా ఓటర్లు నమోదైనట్తు తెలిపారు. వాలంటీర్లుగా, కాంట్రాక్టు పద్దతిన పని చేస్తున్న వారు ఎవరూ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదని స్పష్టం చేశారు.