NEWSTELANGANA

ఒకే ఒక్క‌రు ప్ర‌భుత్వ కొలువులు

Share it with your family & friends

కృషి..నిబ‌ద్ద‌త‌..విజ‌యం
హైద‌రాబాద్ – కృషి, ప‌ట్టుద‌ల ఉంటే దేనినైనా సాధించ వ‌చ్చ‌ని నిరూపించారు తెలంగాణ‌కు చెందిన నిరుద్యోగులు. ఒక్కొక్క‌రిది ఒక్కో క‌థ‌. ల‌క్షలాది మంది పోటీ ప‌డిన ప‌రీక్ష‌ల్లో త‌మ స‌త్తా చాటారు. ఒక్కొక్క‌రు రెండు మూడు ఉద్యోగాలు సాధించారు. అంద‌రినీ విస్తు పోయేలా చేశారు. మొన్న‌టికి మొన్న ఉస్మానియా యూనివ‌ర్శిటీలో వాచ్ మెన్ గా ప‌ని చేసుకుంటూనే మూడు ప్ర‌భుత్వ కొలువులు సాధించాడు ప్రవీణ్ కుమార్.

ఇత‌ను ఒక్క‌డే కాదు మ‌రికొంద‌రు తాము కూడా తీసిపోమంటూ ప‌లు జాబ్స్ సాధించ‌డం విశేషం. హైదరాబాద్‌లో పనిచేస్తున్న తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ బల్వంత్ రావు తెలంగాణలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), జూనియర్ లెక్చరర్ (జేఎల్) ఉద్యోగాలకు ఎంపికయ్యాడు.

ఖమ్మంకు చెందిన కొలపూడి శృతి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఎక్సైజ్ కానిస్టేబుల్, మహిళా శిశు సంక్షేమ శాఖలో విస్తరణ అధికారి, గురుకుల సంస్థ‌లో లైబ్రేరియ‌న్ తో పాటు డిగ్రీ లెక్చరర్ సాధించింది.

టీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ప్రభుత్వ ఉద్యోగాలను నాగర్ కర్నూల్‌కు చెందిన అక్షయ్ కుమార్, నిజామాబాద్‌కు చెందిన దగ్గు మనీషా కైవసం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వనజ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు పొందింది. ఆమె పీజీటీతో పాటు జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ సాధించింది.

జగిత్యాల నుండి నాగుల సురేష్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు – ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌తో పాటు గురుకుల సంస్థ‌లో టీజీటీ, పీజీటీ, జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పొందాడు. ఇదే ప్రాంతానికి చెందిన కె. పావ‌ని రెండు పోస్టులకు ఎంపికైంది. పీజీటీతో పాటు జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ సాధించింది. పుప్ప‌పాల మ‌మ‌త అయిదు జాబ్స్ సాధించింది.

ఇక సిద్దిపేటకు చెందిన అమరవాది మృణాళిని 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అని విస్తు పోయేలా చేసింది. వికారాబాద్‌కు చెందిన మహిపాల్ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.