చంద్రికా టాండన్ కు అరుదైన గౌరవం
ఇండో అమెరికన్ గాయని చంద్రికా టాండన్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు దక్కింది. 67వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచ దేశాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. చంద్రికా ఎవరో కాదు ప్రముఖ కంపెనీ పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి సోదరి. త్రివేణి ఆల్బమ్ కు గాను ఈ పురస్కారం దక్కింది. జీవితంలో తనకు మరిచి పోలేని జ్ఞాపకం ఈ అవార్డు అంటూ పేర్కొంది.
ఇదిలా ఉండగా చంద్రికా టాండన్ వౌటర్ కెల్లర్ మాన్, జపనీస్ సెల్లిస్ట్ ఎరు మాట్సుమోటోతో కలిసి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ త్రివేణి ఆల్బమ్ గత ఏడాది ఆగస్టు 30న రిలీజ్ అయ్యింది. భారీగా ఆదరణ పొందింది.
అమెరికా మాజీ చీఫ్ జిమ్మీ కార్టర్ కు మరణాంతరం గ్రామీ అవార్డు దక్కింది. ఆయన తరపున మనవడు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తన జీవిత కాలంలో మూడు పురస్కారాలను అందుకున్నారు జిమ్మీ కార్టర్.