షఫాలీ రికార్డ్ మంధాన సూపర్
టెస్ట్ మ్యాచ్ లో భారీ భాగస్వామ్యం
చెన్నై – చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత మహిళా క్రికెటర్లు దుమ్ము రేపారు. అరుదైన రికార్డ్ నమోదు చేశారు. షఫాలీ వర్మ, స్మృతి మంధాన అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
కేవలం 4 వికెట్లు కోల్పోయి 431 రన్స్ చేసింది. ఇదిలా ఉండగా ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ను భారత జట్టు బద్దలు కొట్టింది. షఫాలీ వర్మ డబుల్ సెంచరీ సాధించింది. స్మృతి మంధాన తానేమీ తక్కువ కాదంటూ నిరూపించింది.
ఇద్దరు కలిసి 292 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రికెట్ చరిత్రలో ఇది అరుదైన రికార్డ. గతంలో ఆస్ట్రేలియన్ జంట ఎల్ ఏ రీలర్ , డీఏ అన్నెట్స్ మధ్య 209 పరుగుల పార్టనర్షిప్ నెలకొంది. 2014లో మైసూర్ లో దక్షిణాఫ్రికా పై పూనమ్ రౌత్ , తిరుష్ కామిని 275 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. మునుపటి అత్యధిక భాగస్వామ్యాన్ని షఫాలీ, స్మృతి అధిగమించారు.
మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించింది షఫాలీ వర్మ. కేవలం 194 బంతుల్లో తన మైలు రాయిని నెలకొల్పారు. జట్టు 98 ఓవర్లలో 525 రన్స్ చేసింది. షఫాలీ 205 రన్స్ చేస్తే స్మృతీ మంధాన 149 రన్స్ చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 55, హర్మన్ ప్రీత్ కౌర్ 42 రన్స్ చేయగా రిచా ఘోష్ 43 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.