అండర్ 19 వరల్డ్ కప్ లో సూపర్
మలేషియా – మలేషియా వేదికగా జరిగిన మహిళల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రతిభను చాటింది తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష. సౌతాఫ్రికాతో జరిగిన ఈ కీలక పోరులో అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. అంతే కాదు టోర్నీలో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది.
తొలుత బ్యాటింగ్ కు దిగిన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జట్టును నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకే చాప చుట్టేసింది. త్రిష అద్భుతమైన బౌలింగ్ తో అదుర్స్ అనిపించింది. 15 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసింది. మిగతా బౌలర్లు కూడా ప్రతిభ చాటారు.
అనంతరం 83 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 83 రన్స్ చేసింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. చరిత్ర సృష్టించింది. 44 రన్స్ చేసింది. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఏపీ హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి కంగ్రాట్స్ తెలిపారు.