కరీనా కపూర్ పై నారాయణ మూర్తి ఫైర్
ప్రజల పట్ల ప్రేమ లేక పోతే ఎలా ..?
బెంగళూరు – ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు ప్రజలు అంటే గౌరవం లేదన్నారు. ఒక స్థాయికి ఎదిగిన వారు ప్రజల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలని స్పష్టం చేశారు. లేక పోతే బతుక్కి అర్థం లేదన్నారు నారాయణ మూర్తి.
ఆయన కరీనా కపూర్ పై తీవ్ర విమర్శలు చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం నారాయణ మూర్తి వైరల్ గా మారారు. ఏ స్థాయిలో ఉన్నా, ఎంతగా పాపులర్ అయినా, ఎన్ని కోట్లు సంపాదించినా మూలాలు మరిచి పోకూడదని తెలిపారు.
తాను లండన్ నుండి వస్తున్నానని , ఆ సమయంలో తన పక్కనే కరీనా కపూర్ కూర్చున్నారని తెలిపారు.
చాలా మంది ప్రయాణీకులు ఆమెను గుర్తించారని, తనను పలకరించేందుకు వస్తున్నారని, కానీ కరీనా కపూర్ గర్వంగా తను హలో అని కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు నారాయణ మూర్తి.
సమస్య ఏమిటంటే ఎవరైనా ప్రేమను చూపినప్పుడు, మీరు కూడా దానిని తిరిగి చూపించవచ్చు అని పేర్కొన్నారు. ఇది చాలా ముఖ్యమైనదని తాను భావిస్తున్నానని, ఇవన్నీ మీ అహాన్ని తగ్గించే మార్గాలు అని స్పష్టం చేశారు నారాయణ మూర్తి.