Wednesday, April 2, 2025
HomeBUSINESSఇన్ఫోసిస్ కో ఫౌండ‌ర్ పై కేసు న‌మోదు

ఇన్ఫోసిస్ కో ఫౌండ‌ర్ పై కేసు న‌మోదు

గోపాల‌కృష్ణ‌న్ కు కోలుకోలేని బిగ్ షాక్

బెంగ‌ళూరు – ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ కు బిగ్ షాక్ త‌గిలింది. త‌న‌తో పాటు మ‌రో 18 మందిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 71వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు ఆదేశాల మేరకు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2014లో తనను హనీ ట్రాప్ కేసులో ఇరికించార‌ని, స‌ర్వీస్ నుండి తొల‌గించారంటూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న దుర్గ‌ప్ప ఆరోపించారు.

ఫిర్యాదుదారుడు దుర్గప్ప గిరిజన బోవి వర్గానికి చెందినవాడు. త‌న‌ను దారుణంగా అవ‌మానించార‌ని వాపోయాడు. అంతే కాకుండా అకార‌ణంగా త‌నను స‌ర్వీస్ లోంచి తీసి వేశార‌ని అన్నాడు. కుల వివ‌క్ష‌తో వేధింపుల‌కు గురి చేశార‌ని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతర వ్యక్తులలో గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్య విశ్వస్వరాయ్, హరి కె వి ఎస్, దాసప్ప, బలరామ్ పి, హేమలత మ్హిషి, చటోపాద్యాయ కె, ప్రదీప్ డి సావ్కర్ ,మనోహరన్ ఉన్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా న‌మోదైన ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి హెచ్ఎస్సీ బోర్డు ఆఫ్ ట్ర‌స్టీ స‌భ్యుడిగా ప‌ని ఏస్తున్న క్రిస్ గోపాల‌కృష్ణ‌న్ నుండి ఇంకా స్పంద‌న రాలేదు.

ఐటీ దిగ్గ‌జ సంస్థ‌గా ఇన్ఫోసిస్ పేరుంది. కో ఫౌండ‌ర్ పై కేసు న‌మోదు కావ‌డంతో ఒక్క‌సారిగా సంస్థ‌లో క‌ల‌క‌లం రేపింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments