కనిష్ట స్థితికి పడి పోయిన వాతావరణం
ఢిల్లీ – ఉష్ణోగ్రతల మరింత తగ్గుదలతో దేశ వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత మరింత పెరిగింది. దీంతో జనం బయటకు వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఢిల్లీ , పంజాబ్, హర్యానా, ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్, తదితర రాష్ట్రాలన్నీ వణుకుతున్నాయి.
ప్రధానంగా నగరాలను పొగ మంచు కప్పేసింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరిగింది. 31 నాటికి కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుందని IMD అంచనా వేసింది. వాతావరణ తీవ్రతను తగ్గించేందుకు ఆయా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి.
రోజు రోజుకు వాతావరణం కనిష్ట స్థితికి చేరుకోవడంతో వృద్దులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా కనిష్ట ఉష్ట్రోగ్రత 13 డిగ్రీల సెల్షియస్ కు పడి పోయింది. సాధారణం కంటే మరింత తక్కువ అని పేర్కొంది కేంద్ర వాతావరణ శాఖ. పొగ మంచు దట్టంగా పేరుకు పోయింది.
మరోవైపు పంజాబ్, రాజస్థాన్, హర్యానా, చండీగఢ్‌లలో చలిగాలుల తీవ్రత పెరుగుతుందని అంచనా వేసింది. దట్టమైన పొగమంచు కారణంగా పంజాబ్‌లోని పలు నగరాలకు అలర్ట్ ప్రకటించింది.