Wednesday, April 9, 2025
HomeNEWSనేడు మాన‌వ హ‌క్కుల దినోత్స‌వం

నేడు మాన‌వ హ‌క్కుల దినోత్స‌వం

ప్ర‌పంచ వ్యాప్తంగా కార్య‌క్ర‌మాలు

హైద‌రాబాద్ – ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 10న ప్ర‌పంచ మాన‌వ హ‌క్కుల దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఐదేళ్ల‌కు ఒక‌సారి మాన‌వ హ‌క్కుల కోసం కృషి చేసిన వారికి, నోబెల్ పుర‌స్కారం పొందిన వారిని యుఎస్ఏ స‌న్మానిస్తుంది.

1948 డిసెంబరు 10న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. అందువల్ల డిసెంబరు 10వ తేదీని అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాట చేశారు.

‘మాగ్నా కార్టా’ మొట్ట మొదటి మానవ హక్కుల ప్రకటన నుండే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు రూపొందించారు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్. 1993లో రూపొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994, జనవరి 8నుండి అమలులోకి వచ్చింది.

.యు.డి.హెచ్‌.ఆర్‌ రూపొందించిన డాక్యుమెంట్‌ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది.
1998లో మాల్దావా ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ ది యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అంటూ ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments