ఏసీల్లోని కంప్రెసర్ పేలడం వల్లనే ప్రమాదం
హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చార్మినార్ లోని గుల్జార్ హౌస్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సీఎం విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన క్లూస్, ఫోరెన్సిక్ బృందం విచారణ చేపట్టింది. గుల్జార్ హౌసులో ప్రమాద కారణాలపై నిర్ధారణకు వచ్చారు. ఇంటి మొత్తంలో 14 ఏసీలు ఉన్నట్లు గుర్తించారు. గ్రౌండ్ ప్లస్ టు అంతస్తుల భవనం మొత్తం తునా తునకలు అయ్యింది. మూడు అంతస్తుల భవనంలో పనికి రాకుండా పోయాయి వస్తువులు. వేడి వల్ల ఫ్లోర్స్ మొత్తం పగుళ్లు ఏర్పడినట్లు గుర్తించారు. ఫ్లోర్ లో ఉన్న టైల్స్ మార్బుల్స్ మొత్తం ధ్వంసం అయ్యాయి.
ఈ మొత్తం వ్యవహారంలో భవన నిర్మాణంపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది క్లూస్ విచారణ టీం. మూడంతస్తుల భవంతి పూర్తిగా డ్యామేజ్ అయ్యిందని గుర్తించింది. మరో వైపు ఈ మొత్తం అగ్ని ప్రమాదం ఘటనపై సర్కార్ హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్వయంగా సందర్శించారు. బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందాల పోటీల కంటే ప్రమాదం జరగకుండా చూడాలన్నారు.