SPORTS

ఎల‌క్ట్రిక్ స్ట్రైక‌ర్ విన్న‌ర్ జేక్ ఫ్రేజ‌ర్

Share it with your family & friends

ఐపీఎల్ 2024లో దుమ్ము రేపిన క్రికెట‌ర్

చెన్నై – ఐపీఎల్ 2024 క‌థ ముగిసింది. విజేత‌గా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిలిచింది. ప్రైజ్ మ‌నీ కింద రూ. 20 కోట్లు ద‌క్కాయి. ర‌న్న‌ర‌ప్ గా స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు నిలిచింది. ఆ జ‌ట్టుకు రూ. 12.5 కోట్లు ద‌క్కాయి. 3వ స్థానంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు రూ. 7 కోట్లు ల‌భించ‌గా 4వ స్థానంలో నిలిచిన బెంగ‌ళూరుకు రూ. 6.5 కోట్లు ద‌క్కాయి.

ఇదిలా ఉండ‌గా అత్యంత విలువైన ఆట‌గాడిగా విండీస్ క్రికెట‌ర్ , కేకేఆర్ స్టార్ ప్లేయ‌ర్ సునీల్ న‌రైన్ నిలిచాడు. ఎమ‌ర్జింగ్ క్రికెట‌ర్ గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి ల‌భించ‌గా ప‌ర్ప‌ల్ క్యాప్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ కు ద‌క్కింది. త‌ను 24 వికెట్లు తీశాడు. పంజాబ్ జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు.

ఇక ఆర్సీబీకి చెందిన ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క‌ప్ అందుకున్నాడు. టోర్నీలో అంద‌రికంటే అత్య‌ధికంగా ప‌రుగులు చేశాడు. త‌ను 741 ర‌న్స్ తో టాప్ లో నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా దేశానికి చెందిన యంగ్ క్రికెట‌ర్ జేక్ ఫ్రేజ‌ర్ స‌త్తా చాటాడు. ప్ర‌త్య‌ర్థులకు చుక్క‌లు చూపించాడు. త‌ను ఈ ఐపీఎల్ లో ఎల‌క్ట్రిక్ స్ట్రైక‌ర్ అవార్డు విన్న‌ర్ గా నిలిచాడు.