SPORTS

ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి

Share it with your family & friends

ఐపీఎల్ 2024లో స‌త్తా చాటిన కుర్రాడు

చెన్నై – కోట్లాది మంది క్రికెట్ ప్రేమికుల‌ను ఆనంద డోలిక‌ల్లో తేలియాడేలా చేసిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 2024 క‌థ ముగిసింది. 17వ లీగ్ లో ప‌రుగుల వ‌ర‌ద పారింది. దేశీయ ఆటగాళ్లు దుమ్ము రేపారు. విదేశీ ఆట‌గాళ్లు స‌త్తా చాటారు. మొత్తంగా ప్ర‌తి జ‌ట్టు ప‌రుగుల వరద పారించింది. భారీ స్కోర్ల‌తో దుమ్ము రేపాయి. సెంచ‌రీలు, హాఫ్ సెంచ‌రీల‌తో క్రికెట‌ర్లు క‌దం తొక్కారు. మ‌రో వైపు టాప్ బౌల‌ర్ల‌ను దంచి కొట్టారు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో హోరెత్తించారు.

ఈ ఐపీఎల్ సీజ‌న్ లో కొత్త‌గా తెలుగు కుర్రాడు మెరిశాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశాఖ ప‌ట్ట‌ణానికి చెందిన నితీశ్ కుమార్ రెడ్డి దుమ్ము రేపాడు. త‌ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటాడు.

మొత్తం 300ల‌కు పైగా ప‌రుగులు సాధించాడు. కీల‌కమైన స‌మ‌యంలో వికెట్లు కూల్చాడు. దీంతో ఐపీఎల్ 2024లో ఏకంగా అంద‌రి ఆట‌గాళ్ల‌ను కాద‌ని ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ అవార్డుకు ఎంపిక‌య్యాడు నితీశ్ కుమార్ రెడ్డి. ప్రైజ్ మ‌నీ కింద రూ. 10 ల‌క్ష‌లు అంద‌జేసింది ఐపీఎల్ యాజ‌మాన్యం. త‌మ జ‌ట్టు ఆట‌గాడికి అవార్డు ద‌క్క‌డం ప‌ట్ల ఎస్ ఆర్ హెచ్ య‌జ‌మాని కావ్య మార‌న్ సంతోషం వ్య‌క్తం చేశారు.