హైదరాబాద్ కు ఫెయిర్‌ప్లే అవార్డు
ఐపీఎల్ 2024లో సూపర్ షో ఎస్ఆర్ హెచ్
చెన్నై – తమిళనాడు లోని చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 కథ ముగిసింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది. ప్రత్యర్థి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. ఈ జట్టుకు చెందిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు.
ఇక ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి. నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. వీటిలో కోల్ కతా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. ఎలిమినేటర్ , క్వాలిఫయర్ -1, 2 కు సంబంధించిన మ్యాచ్ లలో చివరకు కేకేఆర్ , ఎస్ ఆర్ హెచ్ జట్లు ఫైనల్ లో తలపడ్డాయి. చివరకు కేకేఆర్ దెబ్బకు హైదరాబాద్ ఠారెత్తి పోయింది.
ఇదిలా ఉండగా మొత్తం టోర్నీలో ఫెయిల్ ప్లే ఏ అవార్డుకు పలు జట్లు పోటీ పడ్డాయి. కానీ చివరకు ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుపొందింది. టోర్నీ ఆరంభం నుంచి దుమ్ము రేపుతూ వచ్చిన ఎస్ ఆర్ హెచ్ చివరలో చేతులెత్తేయడం విస్తు పోయేలా చేసింది.