కోల్ కతా కదం తొక్కనుందా
హైదరాబాద్ తో ఢీ కొట్టేందుకు రెఢీ
చెన్నై – మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ మార్గదర్శకత్వంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అత్యంత బలంగా తయారైంది. శ్రేయాస్ అయ్యార్ సారథ్యంలో టీం అన్ని రంగాలలో రాణిస్తోంది. ప్రధానంగా ఐపీఎల్ 2024లో ఆది నుంచీ ఫైనల్ దాకా ఆ జట్టు ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది.
బ్యాటింగ్ లో రాణించింది..బౌలింగ్ లో దుమ్ము రేపింది. ఫీల్డింగ్ లో విస్తు పోయేలా చేసింది. మొత్తంగా సమిష్టి ఆట తీరుతో కోల్ కతా నైట్ రైడర్స్ సత్తా చాటుతోంది. ఇక ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. గత రెండు నెలలుగా కొనసాగుతూ వచ్చిన ఈ బిగ్ టోర్నీకి ఆదివారం నాటితో చెపాక్ వేదికగా చెక్ పడనుంది.
ఇక జట్టు పరంగా చూస్తే అన్నింట్లోనూ సరి సమానంగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో సమరానికి సిద్దమైంది కేకీఆర్. ఇక టీంలో అరివీర భయంకరమైన ఆటగాళ్లు ఉన్నారు. సునీల్ నరైన్ , గుర్బాజ్ , వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్ ) రింకూ సింగ్ , ఆండ్రూ రస్సెల్ , నితీశ్ రాణా, రమన్ దీప్ సింగ్ , మిచెల్ స్టార్క్ , హర్షిత్ , వరుణ్ , వైభవ్ అరోరా ఆడతారు.