SPORTS

ఖ‌రారు కాని ప్లే ఆఫ్స్

Share it with your family & friends

ఐపీఎల్ 2024 ఉత్కంఠ భ‌రితం

హైద‌రాబాద్ – ఐపీఎల్ 2024 టోర్నీ అంతిమ ద‌శ‌కు చేరుకుంది. కాగా ఇంకా ప్లే ఆఫ్స్ కు ఎవ‌రు చేరుకుంటార‌నే దానిపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో కొన‌సాగుతున్నాయి కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్. ప్ర‌తి జ‌ట్టు లీగ్ లో భాగంగా 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

ప్ర‌స్తుతానికి కోల్ క‌తా సేఫ్ సైడ్ లో ఉండ‌గా మిగ‌తా మూడు స్థానాల‌లో ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్ లో ఉంటుంద‌నేది ఇంకా తేలాల్సి ఉంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎన్న‌డూ లేనంత‌గా ఉద్విగ్న‌త‌కు లోన‌వుతున్నారు.

అనూహ్యంగా టోర్నీలో మొద‌టి నుంచీ అద్భుత విజ‌యాలు సాధించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చివ‌ర‌లో చ‌తికిల ప‌డింది. ఆ జట్టు ఇంకా 2 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇక చెన్నైకి ఒకే ఒక మ్యాచ్ ఉంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో పాటు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల‌లో ఏ జ‌ట్టు మిగ‌తా స్థానాల‌లో ఉంటాయ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

పోటీలో ఆరు జ‌ట్లు ఉండ‌గా 3 స్థానాల‌కు పోటీ ప‌డుతుండ‌డం విశేషం. మొత్తం మీద ఈసారి జ‌రుగుతున్న 17వ సీజ‌న్ మాత్రం అంచ‌నాలు పెంచుతోంది. ఫ్యాన్స్ ను హీటెక్కిస్తోంది.