తెగిస్తారా లేక తల వంచుతారా
కోల్ కతా తో పోటీకి సిద్దం
చెపాక్ – యుద్ధానికి సిద్దమైంది ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ వేలం పాటలో ఊహించని రీతిలో ధరకు అమ్ముడు పోయిన కమిన్స్ అంచనాలకు తగ్గట్టు ఎక్కువగా రాణించాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
తను ఆడుతూ తన జట్టును మరింత బలోపేతం చేయడంతో పాటు సూపర్ షో ప్రదర్శించేలా చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే కెప్టెన్ అంటే ఇలా ఉండాలి అనేంతగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ తన అంచనాలు తప్పలేదు. ఎంతో మంది ఆమెను ట్రోల్ చేశారు కమిన్స్ విషయంలో తీసుకున్న నిర్ణయానికి .
ఇంత ధర చెల్లిస్తారా అని. కానీ మైదానంలోకి వచ్చాక కమిన్స్ కథేమిటో అర్థమై పోయింది. దీంతో విమర్శకుల నోళ్లు మూత పడ్డాయి. ఇక బలమైన కోల్ కతాతో తెగించి ఆడుతారా లేక తల దించుతారా అన్నది తేలుతుంది రాత్రికి.
ఇక జట్టు విషయానికి వస్తే కమిన్స్ కెప్టెన్ కాగా ట్రావిస్ హెడ్ , అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క రామ్ , క్లాసెన్ , నితీశ్ కుమార్ రెడ్డి, సమద్, షాబాజ్ అహ్మద్ , మయాంక్ అగర్వాల్ , దేవదత్ ఉనాద్కత్ , భువనేశ్వర్ , నటరాజన్ ఆడనున్నారు.