SPORTS

ప్లే ఆఫ్స్ రేసులో హైద‌రాబాద్

Share it with your family & friends

స‌త్తా చాటుతున్న స‌న్ రైజ‌ర్స్

హైద‌రాబాద్ – ఐపీఎల్ 2024లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఊహించ‌ని రీతిలో గ‌త ఐపీఎల్ లో స‌త్తా చాట‌ని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈసారి 17వ సీజ‌న్ లో అనూహ్యంగా దూసుకు వ‌చ్చింది. భారీ ఎత్తున స్కోర్ల‌ను సాధించ‌డం, ఇత‌ర జ‌ట్ల‌ను ఊచ‌కోత కోయ‌డం ఆ జ‌ట్టుకు క‌లిసి వ‌చ్చేలా చేసింది.

హైద‌రాబాద్ ఇప్ప‌టి వ‌ర‌కు 14 మ్యాచ్ ల‌కు గాను 12 మ్యాచ్ లు ఆడింది. మొత్తం 7 మ్యాచ్ లు విజ‌యం సాధించి 14 పాయింట్ల‌తో నిలిచింది. ఇంకా 2 లీగ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో ఏ ఒక్క‌టి గెలిచినా స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ప్లే ఆప్స్ కు చేరుతుంది. ఏ విధంగా చూసినా జ‌ట్టు బ‌లంగా ఉంది. అద్భుతంగా ఆడుతోంది.

ఎలాగైనా స‌రే ఈసారి ఫైన‌ల్ కు వెళ్లాల‌ని , ఐపీఎల్ క‌ప్ చేజిక్కించు కోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ . మొత్తంగా ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇత‌ర జ‌ట్లు గెలిచే విధానంపై వేచి చూడాల్సి ఉంది.