ఐపీఎల్ 2024 విజేతకు రూ. 20 కోట్లు
భారీగా ప్రైజ్ మనీ దక్కించుకున్న కేకేఆర్
చెన్నై – కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు పూర్తి సంతోషాన్ని, అంతులేని ఉత్కంఠను కలిగించిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2024 కథ ముగిసింది. దాదాపు 2 నెలలకు పైగా ఈ లీగ్ కొనసాగింది. మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి. చివరకు నాలుగు జట్లు చివరి దశకు చేరుకున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ ఇందులో ఉన్నాయి.
ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో బెంగళూరు జట్టు ఓటమి పాలైంది. కప్ గెలవాలన్న కోహ్లీ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది సంజూ శాంసన్ సేన. ఎలిమినేటర్ -1 మ్యాచ్ లో 2వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్స్ జట్టును మట్టి కరిపించింది. రాజస్థాన్ ను ఓడించి నేరుగా ఫైనల్ కు చేరుకుంది. ఇక టాప్ లో కొనసాగుతూ వచ్చిన కోల్ కతా నైట్ రైడర్స్ తో ఫైనల్ మ్యాచ్ లో ఢీకొంది.
చివరకు చెన్నై వేదికగా జరిగిన కీలక పోరులో ఎలాంటి ప్రతిఘటన చేయకుండానే చతికిల పడింది. ఫైనల్ లో ఓటమి పాలై రన్నరప్ గా నిలిచింది. ఇక విజేతగా నిలిచిన కోల్ కతా జట్టుకు కప్ తో పాటు రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.