అంగరంగ వైభవంగా ఐపీఎల్ సంబురం
ప్రపంచ క్రికెట్ లో అత్యధిక జనాదరణ కలిగిన ఐపీఎల్ 2025 టోర్నీ కోల్ కతా ఈడెన్ గార్డెన్ వేదికగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో కలిసి క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ ఐపీఎల్ 18వ సీజన్. క్రీడా మైదానంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు సినీ రంగానికి చెందిన నటీ నటులు. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్, పంజాబీ సింగర్ కరన్ హౌజ్లా తమ పాటలతో ఆకట్టుకున్నారు. స్టేడియం మొత్తం చప్పట్లతో మారు మ్రోగింది.
అనంతరం స్టేజిపైకి వచ్చిన షారుక్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించారు. తనతో కలిసి కోహ్లీని స్టెప్పులు వేయాలని కోరాడు. తమ ఫ్రాంచైజీ ప్లేయర్ రింకూ సింగ్, కోహ్లీతో కలిసి డ్యాన్స్ చేయడం ఆసక్తిని రేపేలా చేసింది. ఈ కార్యక్రమంలో బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా , ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ హాజరయ్యారు. ఇక బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ప్రత్యేకంగా కనిపించింది. ఆమెను ఉద్దేశించి షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఐపీఎల్ మ్యాచ్ విషయానికి వస్తే కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభమైంది.