25 పరుగుల తేడాతో ఓటమి
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ను 25 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 రన్స్ చేసింది. అనంతరం 184 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై కేవలం 158 పరుగులు మాత్రమే చేసింది. విజయ్ శంకర్ అద్బుతంగా ఆడినా , చివరకు ధోనీ మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది.
అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ గెలుపు తనకు మూడోది కావడం విశేషం. టోర్నీలో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్తానానికి చేరుకుంది. విచిత్రం ఏమిటంటే 2010 తర్వాత తొలిసారి చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది డీసీ. రాహుల్ 51 బంతుల్లో 3 సిక్సర్లు 6 ఫోర్లు ఉన్నాయి. మొత్తం 77 రన్స్ చేశాడు. అభిషేక్ పోరెల్ 20 బాల్స్ ఎదుర్కొని 33 పరుగులు చేశాడు. సీఎస్కే తరపున ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లలో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.