Wednesday, April 2, 2025
HomeSPORTSచెన్నై దెబ్బ‌కు ముంబై విల‌విల

చెన్నై దెబ్బ‌కు ముంబై విల‌విల

చుక్క‌లు చూపించిన నూర్ అహ్మ‌ద్

ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మూడో లీగ్ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ అద్భుతంగా రాణించింది. ప్ర‌త్య‌ర్థి ముంబై ఇండియ‌న్స్ ను త‌క్కువ స్కోర్ కే క‌ట్ట‌డి చేసింది. సీస్కే బౌల‌ర్లు రెచ్చి పోయారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 155 ర‌న్స్ మాత్రేమ చేసింది. ప‌వ‌ర్ ప్లే లో 3 వికెట్లు కోల్పోయిన స‌మ‌యంలో తిల‌క్ వ‌ర్మ 31 ర‌న్స్ చేయ‌గా కెప్టెన్ సూర్య యాద‌వ్ 29 ర‌న్స్ చేసి ఆదుకున్నారు. డెత్ ఓవ‌ర్ల‌లో దీప‌క్ చాహ‌ర్ 28 , శాంట్న‌ర్ 11 ప‌రుగులు చేయ‌డంతో ఆ మాత్రం స్కోర్ చేసింది. రోహిత్ శ‌ర్మ సున్నాకే వెనుదిరిగాడు. రియాన్ 13 , విల్ జాక్స్ 11 ప‌రుగుల‌కే చాప చుట్టేశారు. అనంత‌రం చెన్నై సూప‌ర్ కింగ్స్ సూప‌ర్ విక్ట‌రీ సాధించింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు చెందిన బౌల‌ర్ నూర్ అహ్మ‌ద్ చుక్క‌లు చూపించాడు. అద్భుత‌మైన బంతుల‌తో క‌ళ్లు చెదిరేలా బౌలింగ్ చేశాడు. ఒకానొక ద‌శ‌లో షాట్స్ కోసం కాకుండా కేవ‌లం డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నం చేశారు ముంబై ఇండియ‌న్స్ ప్లేయ‌ర్స్. నూర్ అహ్మ‌ద్ కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీశాడు. ఇక మ‌హేంద్ర సింగ్ ధోనీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌ను కుర్రాళ్ల‌కు తీసిపోని విధంగా మెరుపు స్టంపింగ్ తో స్టార్ క్రికెట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ ను పెవిలియ‌న్ కు పంపించాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments