సమరానికి ఇరు జట్లు సన్నద్ధం
చెన్నై – ఐపీఎల్ 2025 18వ సీజన్ లో భాగంగా మూడో కీలకమైన మ్యాచ్ కు సిద్దమైంది చెన్నైలోని చిదంబరం స్టేడియం. ఇప్పటికే టికెట్లు అమ్ముడు పోయాయి. హోం గ్రౌండ్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జోరు మీదుంది. టైటిల్ ఫెవరేట్ గా ఉన్న ముంబై ఇండియన్స్ తో పోటీ పడనుంది. హై ఓల్టేజ్ నెలకొంది ఈ మ్యాచ్ పై. ఐపీఎల్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్ కతాను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఇవాళ రెండు కీలక మ్యాచ్ లు జరగనుంది. హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడనుంది.
చెన్నై నుంచి మహేంద్ర సింగ్ ధోనీ, ముంబై నుంచి రోహిత్ శర్మల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది మ్యాచ్. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ధోనీ తప్పుకున్నాక సీఎస్కే స్కిప్పర్ గా రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. ఇక స్టాండింగ్ కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ కు సూర్య కుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది ఐపీఎల్ గవర్నింగ్ బాడీ. ఇప్పటికే టికెట్లు పెద్ద ఎత్తున అమ్ముడు పోయినట్లు సమాచారం. రూ. 5000 నుండి రూ. 30 వేలకు పైగానే ఆయా సంస్థలు అమ్మినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.