చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా సమ ఉజ్జీల మధ్య కీలకమైన లీగ్ మ్యాచ్ సిద్దమైంది. నువ్వా నేనా అన్న రీతిలో ఇరు జట్లు ఢీకొనేందుకు రెడీ అయ్యాయి. ఇరు జట్లు తొలి మ్యాచ్ లో గెలుపొంది సమంగా ఉన్నాయి. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా ఆడింది. ముంబై ఇండియన్స్ జట్టును ఓడించింది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో కోల్ కతా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా ఆడింది. స్వంత మైదానంలో ఓడించింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇక ఈ కీలక మ్యాచ్ మార్చి 28న వేదిక కానుంది. ఇరు జట్లు అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ బలంగా ఉన్నాయి. దీంతో పోరు మాత్రం మరింత ఉత్కంఠను రేపనుండడం ఖాయం. ఎవరు గెలుస్తారనే దానిపై చర్చలు మొదలయ్యాయి.
ఇక జట్ల విషయానికి వస్తే చెన్నై స్వంత గడ్డ కావడంతో ధోనీ టీంకు బిగ్ అడ్వాంటేజ్ కానుంది. ఆర్సీబీకి రజిత్ పాటిదార్ నాయకత్వం వహిస్తుండగా సీఎస్కేకు రుతురాజ్ గైక్వాడ్ స్కిప్పర్ గా ఉన్నాడు. జట్ల పరంగా చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ, మోహిత్ రతి/స్వప్నిల్ సింగ్ ఆడనున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దుబే, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతిషా పతిరానా, ఖలీల్ అహ్మద్ ఆడతారు.