50 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ
చెన్నై – ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన 8వ లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. దీంతో 50 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. టోర్నీలో భాగంగా ప్రారంభ మ్యాచ్ కోల్ కతాలో ఆడింది. కోల్ కతా నైట్ రైడర్స్ ను ఈడెన్ గార్డెన్స్ లో ఓడించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నైని కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి చెన్నై ప్లేయర్లు ఆశించిన మేర ఆడలేక పోయారు. చివరలో వచ్చిన ధోనీ మెరిసినా ఫలితం లేక పోయింది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ తరపున కెప్టెన్ రజిత్ పాటిదార్ 51 రన్స్ చేశాడు. ఫిల్ సాల్ట్ 32 , విరాట్ కోహ్లీ 31 , దేవదత్ పడిక్కల్ 27 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీంతో చెన్నై జట్టుకు 197 పరుగుల టార్గెట్ అందించింది. ఆఖరులో సామ్ కరన్ బౌలింగ్ లో తుక్కు రేపాడు టిమ్ డేవిడ్. వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. దీంతో గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది ఆర్సీబీ.