తుక్కు రేగొట్టిన అశుతోష్ శర్మ
విశాఖట్నం – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా విశాఖ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు అశుతోష్ శర్మ. మరో వైపు మార్ష్, పూరన్ లు చెలరేగి ఆడినా ఫలితం లేకుండా పోయింది. ఒకానొక దశలో అపజయం తప్పదని అనుకున్న తరుణంలో సునామీలా వచ్చాడు శర్మ. లక్నో జెయింట్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. 135 రన్స్ కే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో మైదానంలోకి వచ్చిన అశుతోష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పిచ్చ కొట్టుడు కొట్టాడు. లక్నో బౌలర్లను ఉతికి ఆరేశాడు. 31 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 5 సిక్సర్లతో గెలిపించాడు.
లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ గా ఉన్న రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారోనని ఉత్కంఠ రేపింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల కంటే ఈ మ్యాచ్ అత్యంత సంచలనం రేపింది. ప్రత్యేకించి గెలవదని డిసైడ్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కు అశుతోశ్ శర్మ రూపంలో గెలుపు దక్కడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే తను ఒంటి చేత్తో మ్యాచ్ ను విజయ తీరాలకు చేర్చాడు. అందుకే ఐపీఎల్ అంటే అంత క్రేజీ. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి 211 రన్స్ చేసింది. ఇక లక్నో జట్టులో పూర్ 75 రన్స్ చేస్తే మార్ష్ 72 పరుగులతో రెచ్చి పోయారు. అయినా వర్కవుట్ కాలేదు.