36 పరుగుల తేడాతో ఓటమిపాలు
గుజరాత్ – ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక లీగ్ లో అద్భుత విజయాన్ని సాధించింది గుజరాత్ టైటాన్స్. ముంబై ఇండియన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆడిన రెండు మ్యాచ్ లలో పరాజయం పాలైంది. ఇప్పటి వరకు బోణీ కొట్టలేదు. ముంబై ఇండియన్స్ జట్టును 36 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 8 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. సాయి సుదర్శన్ సూపర్ హాఫ్ సెంచరీతో పాటు కెప్టన్ శుభ్ మన్ గిల్ , జోస్ బట్లర్ అద్భుతంగా ఆడారు.
అనంతరం బరిలోకి దిగిన ముంబై పోరాడినా ఫలితం లేకుండా పోయింది. సూర్య ఒక్కడే 48 రన్స్ చేశాడు. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్కిప్పర్ గా తిరిగి వచ్చాక హార్దిక్ పాండ్యా బౌలింగ్ పరంగా రాణించినా బ్యాటింగ్ లో విఫలం అయ్యాడు. రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చీ రావడంతోనే హైదరాబాద్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్ రెండు బంతులను అద్భుతంగా రెండు ఫోర్లు కొట్టాడు. ఆ వెంటనే సూపర్ స్పెల్ తో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ముంబై బ్యాటర్లు పరుగులు తీసేందుకు నానా తంటాలు పడ్డారు.