58 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం
గుజరాత్ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 18వ సీజన్ లో టాప్ లో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ కు చుక్కలు చూపించింది. 58 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. కెప్టెన్ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 217 రన్స్ చేసింది. సాయి సుదర్శన్ ఉతికి ఆరేశాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 82 రన్స్ చేయగా బట్లర్ 36, షారుక్ ఖాన్ 36 రన్స్ చేశారు. తుషార్ దేష్ పాండే 53 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయగా తీక్షణ 54 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ 159 పరుగులకే పరిమితమైంది. శాంసన్, సిమ్రోన్ హిట్ మైర్ మినహా ఏ ఒక్కరూ ఆడలేదు. యశస్వి జైశ్వాల్ , రియాన్ పరాగ్, నితీశ్ రాణా, ధ్రువ్ జురైల్ పెవిలియన్ బాట పట్టారు. సిమ్రాన్ 32 బంతుల్లో 52 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 3 సిక్స్ లు ఉన్నాయి. శాంసన్ 41 రన్స్ చేసినా ఫలితం లేక పోయింది. ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు రాజస్థాన్ కు చుక్కలు చూపించాడు. 24 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీయగా సాయి కిషోర్ 20 రన్స్ ఇచ్చి మరో రెండు వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో అంతగా రాణించని రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో దుమ్ము రేపాడు. సూపర్ బౌలింగ్ తో షాక్ ఇచ్చాడు. తను కూడా 2 వికెట్లు తీశాడు.