గెలిచేది ఎవరు..నిలిచేది ఎవరు
గుజరాత్ – ఐపీఎల్ 2025 టోర్నీలో మరో కీలక మ్యాచ్ కు వేదిక కానుంది అహ్మదాబాద్. బుధవారం గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు కొనసాగనుంది. హోం గ్రౌండ్ కావడంతో గుజరాత్ కు అడ్వాంటేజ్ కానుంది. ప్రస్తుతం ఇది 23వ మ్యాచ్ కావడం విశేషం. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. గుజరాత్ టైటాన్స్ జోరుమీదుంది. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో 11 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ , ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లపై వరుస విజయాలు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్ లు ఆడింది. 2 మ్యాచ్ లలో ఓడి పోయి మరో 2 మ్యాచ్ లలో గెలుపొందింది.
ఇక అహ్మదాబాద్ వేదికపై మొత్తం 38 మ్యాచ్‌లు జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 17 మ్యాచ్‌లను గెలుచుకున్నాయి, అయితే ఛేజింగ్ చేసిన జట్లు 20 సందర్భాలలో విజయం సాధించాయి. ఇక మ్యాచ్ ల పరంగా చూస్తే గుజరాత్ టైటాన్స్ ఒక మ్యాచ్ గెలుపొందగా రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్ లలో విజయం సాధించింది. గుజరాత్ జట్టులో శుభ్ మన్ గిల్ కెప్టెన్ కాగా సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఆడతారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా రూథర్ ఫోర్డ్ రానున్నారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు శాంసన్ స్కిప్పర్ కాగా రియాన్ పరాగ్, నితీష్ రాణా, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్, సందీప్ శర్మ ఆడతారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా కుమార్ కార్తికేయ రానున్నారు.