ఒక్క పరుగు తేడాతో ముంబై ఓటమి
ముంబై – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి బంతి వరకు సాగిన మ్యాచ్ లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 156 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం అదుర్స్ అనిపించినా ఆ తర్వాత టపా టపా వికెట్లు పడ్డాయి. వర్షం అడ్డంకిగా మారడం, మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. చివరకు ప్రారంభమైన మ్యాచ్ బంతి బంతికి నువ్వా నేనా అన్న రీతిలో సాగింది.
ఈ గెలుపుతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. వరుస విజయాలతో దూసుకు పోతున్న ముంబై ఇండియన్స్ కు షాక్ ఇచ్చింది. తొలుత ముంబై 8 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది. విల్ జాక్స్ 35 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్ లతో 53 రన్స్ చేశారు. సూర్య కుమార్ యాదవ్ 24 బంతుల్లో 35 రన్స్ చేశారు ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. గుజరాత్ బౌలర్లు సాయి కిషోర్ 34 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కొయెట్జ్ 10 రన్స్ ఇచ్చి 1 , అర్షన్ ఖాన్ , రషీద్ ఖాన్, సిరాజ్ లు చెరో వికెట్ చొప్పున తీశారు. గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. గిల్ 43, బట్లర్ 30 రన్స్ చేశారు. బుమ్రా 2, బౌల్ట్ 2 వికెట్లు తీశారు.