గుజరాత్ టైటాన్స్ గెలుపు జోరు
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా కోల్ కతా వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది గుజరాత్ టైటాన్స్. 39 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ గిల్ రెచ్చి పోయాడు. 10 ఫోర్లు 3 సిక్స్ లతో 55 బంతుల్లో 90 రన్స్ చేశాడు. సాయి సుదర్శన్ 6 ఫోర్లు ఒక సిక్స్ తో 52 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 114 పరుగులు జోడించారు. కోల్ కతా బౌలర్లు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 రన్స్ చేసింది గుజరాత్ టైటాన్స్. అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 159 రన్స్ కే పరిమితమైంది.
కోల్ కతా జట్టులో కెప్టెన్ అజింక్యా రహానే ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. తను హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇతర ఆటగాళ్లు ఎవరూ గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఎదుర్కోలేక పోయారు. పెవిలియన్ బాట పట్టారు. గుజరాత్ బౌలర్లలో అరోరా, రాణా, రస్సెల్ చెరో వికెట్ తీయగా ప్రసిద్ద కృష్ణ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీసి కోల్ కతా నైట్ రైడర్స్ ను శాసించారు. అద్భుతంగా బ్యాటింగ్ ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ శుభ్ మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. ఈ విజయంలో టాటా ఐపీఎల్ టోర్నీలో పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది.