దంచి కొట్టిన మాన్..ప్రియాంశ్ ఆర్య
కోల్ కతా – ఐపీఎల్ 2025లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఎంతకూ తగ్గక పోవడంతో గత్యంతరం లేక అంపైర్లు మ్యాచ్ ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ జట్టు ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ మాన్, ప్రియాంశ్ ఆర్యలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. కోల్ కతా బౌలర్లను ఊచకోత కోశారు.సింగ్ 49 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 83 రన్స్ చేశాడు. ఆర్య 35 బంతుల్లో 69 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 4 సిక్స్ లు ఉన్నాయి.
ఆ తర్వాత బరిలోకి దిగిన కోల్ కతా గుర్జాబ్, సరైన్ ఆడేందుకు ప్రయత్నం చేశారు. ఇందలో వర్షం రావడంతో పెవిలియన్ బాట పట్టారు. ఇదిలా ఉండగా కోల్ కతా జట్టులో వైభవ్ అరోరా 34 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. యాన్సన్ వేసిన తొలి ఓవర్ లో 7 రన్స్ చేసినా వర్షం విడిచి పెట్టలేదు. ఇక కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించారు ప్రభ్ , ఆర్యలు. కళ్లు చెదిరే షాట్స్ తో విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ప్రియాంశ్ ఆర్య కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 120 రన్స్ జోడించారు. ఆ తర్వాత వికెట్లు టపటపా రాలాయి.