Saturday, May 24, 2025
HomeSPORTSఆర్సీబీ ల‌క్ష్యం 175 ర‌న్స్

ఆర్సీబీ ల‌క్ష్యం 175 ర‌న్స్

రాణించిన కెప్టెన్ ర‌హానే

కోల్ క‌తా – కోల్ క‌తా వేదిక‌గా ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా జ‌రిగిన ప్రారంభ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 175 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది ప్ర‌త్య‌ర్థి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు. ఆర్సీబీ బౌల‌ర్లు భారీ స్కోర్ చేయ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. కోల్ క‌తా కెప్టెన్ అజింక్యా ర‌హానే 56 ప‌రుగులు చేశాడు. 30 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. సునీల్ స‌రైన్ 34 రన్స్ చేయ‌గా ర‌ఘువంశీ 30 ప‌రుగుల‌తో రాణించారు. ఆర్సీబీ స్కిప్ప‌ర్ ర‌జిత్ పాటిదార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

రింకూ సింగ్, ఆండ్రూ ర‌సెల్, త‌దిత‌ర కోల్ క‌తా ఆట‌గాళ్లు ఆశించినంత‌గా ఆడ‌లేక పోయారు. బెంగ‌ళూరు జ‌ట్టుకు చెందిన బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. కృణాల్ పాండ్యా 3 బికెట్లు తీయ‌గా, శ‌ర్మ 1 వికెట్, జోష్ హాజిల్ వుడ్ 2 వికెట్లు తీశారు. ఇదిలా ఉండ‌గా 17వ ఐపీఎల్ సీజ‌న్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఛాంపియ‌న్ గా నిలిచింది. ఆర్సీబీ ముందు ఉంచిన ల‌క్ష్యాన్ని ఏ మేర‌కు ఛేదిస్తుందో వేచి చూడాలి. ఇక కోల్ కతా మేనేజ్మెంట్ అజింక్యా ర‌హానేను స్కిప్ప‌ర్ గా చేసింది. త‌ను అద్భుతంగా ఆడాడు ఇవాల్టి మ్యాచ్ లో.

RELATED ARTICLES

Most Popular

Recent Comments