12 పరుగుల తేడాతో ముంబై ఓటమి
లక్నో – ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి ఓవర్ వరకు ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేని స్థితి నెలకొంది. చివరకు 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ ను ఓడించింది. వరుస వైఫల్యాలతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న కెప్టెన్ పంత్ ఈ మ్యాచ్ లో కూడా నిరాశ పరిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్ పరంగా పర్ ఫార్మెన్స్ చేసినా అపజయం నుంచి గట్టెక్కించ లేక పోయాడు. సూర్య క్రీజ్ లో ఉన్నంత సేపు అంతా ముంబై గెలుస్తుందని అనుకున్నారు.
ఇక పాండ్యా గురించి ఎంత చెప్పినా తక్కువే. తను 5 వికెట్లు తీశాడు. 28 విలువైన పరుగులు చేశాడు. సూర్య యాదవ్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇక లక్నో జట్టు తరపున మిచెల్ మార్ష్ , ఐడెన్ మార్క్రమ్ హాఫ్ సెంచరీలతో రెచ్చి పోయారు. రిషబ్ పంత్ ఆరు బంతులు ఎదుర్కొని 2 రన్స్ చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇప్పటి వరకు తాను ఆడిన మ్యాచ్ లలో మొత్తం చేసిన పరుగులు 19. తనను లోక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఆట పరంగా ఆశించినంత మేర రాణించక పోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.