36 బంతులు 81 పరుగులు
గౌహతి – ఐపీఎల్ 2025లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో అద్భుతమైన షో ప్రదర్శించాడు రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్ నితీష్ రాణా. జైశ్వాల్ మరోసారి నిరాశ పరిచాడు. అనంతరం సంజూ శాంసన్ తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు రాణా. కేవలం 36 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 20 పరుగులకే సంజూ శాంసన్ చాప చుట్టేయడంతో బరిలోకి దిగిన స్టాండింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. తను 28 బాల్స్ లు ఎదుర్కొని 37 రన్స్ చేశాఢు.
నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 182 రన్స్ చేశారు రాజస్థాన్ రాయల్స్ టీం. చెన్నై బౌలర్లలో మతీషా పతిరానా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు తరపున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 63 రన్స్ చేశాడు. అయినా జట్టును గెలిపించ లేక పోయాడు. చివర్లో ధోనీ, జడేజా ఉన్నా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 6 పరుగుల తేడాతో చాప చుట్టేసింది. రాజస్థాన్ తరపున హసరంగా 35 రన్స్ ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు.