Saturday, May 24, 2025
HomeSPORTSపంజాబ్ జోరుకు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్రేక్

పంజాబ్ జోరుకు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్రేక్

50 ప‌రుగుల తేడాతో అద్భుత విజ‌యం

ములాన్ పూర్ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు బిగ్ షాక్ ఇచ్చింది. 50 ప‌రుగుల తేడాతో ఓడించింది. ఆర్ఆర్ బౌల‌ర్ల ధాటికి విల విల లాడారు ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్లు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 205 ర‌న్స్ చేసింది. 206 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ 155 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. అంత‌కు ముందు రాజ‌స్థాన్ జ‌ట్టులో జైశ్వాల్ 3 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో 67 ర‌న్స్ చేస్తే రియాన్ ప‌రాగ్ 25 బంతుల్లో 43 ర‌న్స్ చేశాడు. 3 ఫోర్లు 3 సిక్స‌ర్లు ఉన్నాయి. సంజూ శాంస‌న్ 38 ర‌న్స్ చేసి వెనుదిరిగాడు.

కాగా గ‌త మూడు మ్యాచ్ ల‌లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ ప‌రిచిన య‌శ‌స్వి జైశ్వాల్ సూప‌ర్ షో చేశాడు. అద్భుతంగా ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. శాంస‌న్ , జైశ్వాల్ క‌లిసి తొలి వికెట్ కు భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో ఫెర్గుస‌న్ 37 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. 9 వికెట్లు కోల్పోయింది. అనంత‌రం మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ఆదిలోనే జోఫ్రా ఆర్చ‌ర్ ఝ‌ల‌క్ ఇచ్చాడు. నేహాల్ వ‌ధేరా, గ్లెన్ మాక్స్ వెల్ మాత్ర‌మే ఆడారు. మిగ‌తా వారు నిరాశ ప‌రిచారు. వ‌ధేరా 41 బంతుల్లో 62 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 3 సిక్స్ లు ఉన్నాయి. మాక్స్ వెల్ 30 ర‌న్స్ చేశాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments