సత్తా చాటిన కోహ్లీ..రజిత్ పాటిదార్
ఐపీఎల్ 2025లో భాగంగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ప్రారంభ మ్యాచ్ లో రజిత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన రహానే సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 177 రన్స్ చేసింది. ఫిల్ సాల్ట్ 56 రన్స్ చేస్తే విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 4 ఫోర్లు 3 సిక్స్ లతో 59 రన్స్ చేశాడు. స్కిప్పర్ రజిత్ పాటిదార్ 15 బంతులు ఎదుర్కొని 34 రన్స్ చేశాడు. 5 ఫోర్లు ఒక సిక్సర్ కొట్టాడు. ఆదివారం ఎస్ఆర్ హెచ్, ఆర్ఆర్, చెన్నై వర్సెస్ ముంబై మధ్య జరగనుంది.
అంతకు ముందు టాస్ ఓడి మైదానంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు. ఆర్సీబీ బౌలర్లు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. కోల్ కతా కెప్టెన్ అజింక్యా రహానే 56 పరుగులు చేశాడు. 30 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 4 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. సునీల్ సరైన్ 34 రన్స్ చేయగా రఘువంశీ 30 పరుగులతో రాణించారు. ఆర్సీబీ స్కిప్పర్ రజిత్ పాటిదార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.