ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం
ముంబై – ఐపీఎల్ 2025 లో భాగంగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి దాకా పోరాడింది ముంబై ఇండియన్స్. ఆర్సీబీ అద్భుత విజయాన్ని సాధించింది. మరోసారి సత్తా చాటాడు విరాట్ కోహ్లీ. 42 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 67 రన్స్ చేశాడు. కెప్టెన్ రజిత్ పాటిదార్ దుమ్ము రేపాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో 64 రన్స్ చేశాడు. జితేశ్ శర్మ 19 బంతులు మాత్రమే ఎదుర్కొని 2 ఫోర్లు 4 సిక్సర్లతో 40 రన్స్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 రన్స్ చేసింది ఆర్సీబీ.
అనంతరం 222 పరుగుల టార్గెట్ ఛేదనలో మైదానంలోకి దిగిన ఇండియన్స్ 9 వికెట్లు కోల్పోయి 209 రన్స్ మాత్రమే చేసింది. అయినా చివరి దాకా పోరాటం చేసింది. హార్దిక్ పాండ్యా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశాడు గెలిపించేందుకు . కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన బౌలర్ కృనాల్ పాండ్యా ముంబై పాలిట శాపంగా మారాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కళ్లు చెదిరే బంతులతో నలుగురిని పెవిలియన్ కు పంపించాడు. ఆర్సీబీ బౌలర్ల ధాటికో ఓవైపు వికెట్లు కూలుతున్నా తిలక్ వర్మ, పాండ్యా కలిసి మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వర్మ 56 రన్స్ చేస్తే, పాండ్యా 42 పరుగులు చేశారు.