8 వికెట్ల తేడాతో కోల్ తా నైట్ రైడర్స్ విక్టరీ
గౌహతి – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో స్వంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అజింక్యా రహానే సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల భారీ తేడాతో ఓడించింది. టోర్నీలో బోణీ కొట్టింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఘోరంగా ఓటమి పాలైంది రాజస్థాన్ రాయల్స్. పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. పేలవమైన ఆట తీరుతో తీవ్ర నిరాశ పరిచింది. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా ఉన్న ఈ జట్టు ఇంత దారుణంగా ఆడుతుందని ఎవరూ ఊహించ లేదు. అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఒక పద్దతి అంటూ లేకుండా ఆడటం విస్తు పోయేలా చేసింది.
కోల్ కతా స్కిప్పర్ రహానే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. సంజూ శాంసన్ , జైశ్వాల్ , సిమ్రాన్..ఇలా టాప్ ప్లేయర్లంతా నిర్లక్ష్యంగా ఆడారు. జట్టుకు భారంగా మారారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కేవలం 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. క్వింటన్ డికాక్ అద్భుతంగా ఆడాడు. రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అజేయంగా 97 రన్స్ చేశాడు. ఇదిలా ఉండగా ఇవాళ హైదరాబాద్ లోని ఉప్పల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడనుంది.