Wednesday, April 2, 2025
HomeSPORTSతిప్పేసిన శార్దూల్ ఠాకూర్

తిప్పేసిన శార్దూల్ ఠాకూర్

హైద‌రాబాద్ కు బిగ్ ఝ‌ల‌క్

హైద‌రాబాద్ – ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఏదైనా స‌రే మ్యాచ్ కు సంబంధించి తొలి బంతి నుంచే విరుచుకుప‌డే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కోలుకోలేని రీతిలో ఝ‌ల‌క్ ఇచ్చాడు స్టార్ బౌల‌ర్ ల‌ఖ్ న‌వూ సూప‌ర్ జెయింట్స్ కు చెందిన బౌల‌ర్ శార్దూల్ ఠాకూర్. కేవ‌లం 4 ఓవ‌ర్ల‌లో 34 పరుగులు మాత్ర‌మే ఇచ్చి 4 కీల‌క వికెట్లు తీశాడు. ఇక ల‌ఖ్ న‌వూ బౌల‌ర్ల దెబ్బ‌కు దుర్భేద్య‌మైన బ్యాటింగ్ లైన‌ప్ ఉన్న ఎస్ ఆర్ హెచ్ బ్యాట‌ర్లు పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో చెల‌రేగి పోయి, సూప‌ర్ సెంచ‌రీతో దుమ్ము రేపిన ఇషాన్ కిష‌న్ దెబ్బ‌కు డ‌కౌట్ అయ్యాడు. పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ 9 వికెట్లు కోల్పోయి 190 ర‌న్స్ మాత్ర‌మే చేసింది.

అనంత‌రం మైదానంలోకి దిగింది ల‌ఖ్ న‌వూ జ‌ట్టు. జోరు మీదున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించాడు ల‌ఖ్ న‌వూ జ‌ట్టు ప్లేయ‌ర్ నికోల‌స్ పూర‌న్. బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. 191 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సునాయ‌సం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. బౌలింగ్ ప‌రంగా శార్దూల్ ఠాకూర్ కీల‌క పాత్ర పోషిస్తే బ్యాటింగ్ ప‌రంగా పూర‌న్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. నికోల‌స్ పూర‌న్ కేవ‌లం 26 బాల్స్ మాత్ర‌మే ఎదుర్కొని 6 ఫోర్లు 6 సిక్స‌ర్ల మోత మోగించాడు. 70 ర‌న్స్ చేశాడు. మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 52 ప‌రుగులు చేశాడు. ఎప్ప‌టి లాగే కెప్టెన్ రిష‌బ్ పంత్ నిరాశ ప‌రిచాడు. అన‌వ‌స‌ర షాట్ కొట్ట‌బోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు ఎల్ ఎస్ జీ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments