44 పరుగుల తేడాతో హైదరాబాద్ విక్టరీ
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రత్యర్థి రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. 287 పరుగుల భారీ లక్ష్యం ఛేదించేందుకు చివరి దాకా పోరాడింది. కానీ ఎస్ఆర్ హెచ్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. స్కిప్పర్ పాట్ కమిన్స్ అద్భుతమైన కెప్టెన్సీ కూడా తోడయ్యారు. వచ్చీ రావడంతోనే సిమ్రజిత్ సింగ్ పవర్ ప్లే లోనే వికెట్లు కూల్చాడు. ఓపెనర్ గా ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ బాధ్యతాయుతంగా ఆడాడు. 66 రన్స్ చేశాడు. ధ్రువ్ జురైల్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
తను 70కి పైగా పరుగులు సాధించాడు. సిమ్రాన్ హిట్మైర్, శివమ్ దూబే ఆఖరులో మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సంజూ శాంసన్ కు గాయం కావడంతో స్టాండింగ్ కెప్టెన్ గా రియాన్ పరాగ్ నిర్వహించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు ఎంత కష్ట పడినా ఫలితం దక్కలేదు. ట్రావిస్ హెడ్, ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కిషన్ సెంచరీతో కదం తొక్కాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి 30 రన్స్ చేస్తే క్లాసెన్ 34 రన్స్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 286 పరుగుల భారీ స్కోర్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్.