రెచ్చి పోయిన అనికేత్ వర్మ..క్లాసెన్
విశాఖపట్నం – ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా విశాఖపట్టణం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశించిన మేర రాణించలేదు. ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆశించిన మేర రాణించ లేక పోయారు. నిర్ణీత ఓవర్లలో 163 రన్స్ మాత్రమే చేశారు. క్లాసెన్ 2 ఫోర్లు 2 సిక్సర్లతో 32 రన్స్ చేయగా అనికేత్ వర్మ అద్భుతంగా ఆడాడు. 41 బంతులు మాత్రమే ఆడి 74 రన్స్ చేశాడు. 5 ఫోర్లు 6 బిగ్ సిక్సర్లతో రెచ్చి పోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 164 పరుగుల లక్ష్యం ఉంది.
అనంతరం 164 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఆడింది. కేవలం 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. కేవలం 16 ఓవర్లలోనే 166 రన్స్ చేసింది. జేక్ ఫ్రేజర్ 4 ఫోర్లు 2 సిక్సర్లతో 38 పరుగులు చేయగా, పాఫ్ డుప్లెసిస్ అద్భుతంగా ఆడారు. హాఫ్ సెంచరీతో రెచ్చి పోయాడు. 27 బంతులు మాత్రమే ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్సర్లు చేశాడు. హైదరాబాద్ బౌలర్లను ఉతికి ఆరేశారు ఈ ఇద్దరు ఆటగాళ్లు. అభిషేక్ పోరల్ 2 ఫోర్లు 2 సిక్సర్లతో 34 రన్స్ చేయగా కేఎల్ రాహుల్ 15 పరుగులు చేశాడు. స్టబ్స్ 3 ఫోర్లతో 21 పరుగులు చేసి పని పూర్తి కానిచ్చేశారు.