7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి
హైదరాబాద్ – ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సూపర్ షో చేశాడు. ఏకంగా 4 వికెట్లు కూల్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 రన్స్ మాత్రమే చేసింది. సాయి కిషోర్ 2 , ప్రసిద్ద్ కృష్ణ 2 వికెట్లు కూల్చారు. నితీశ్ రెడ్డి 31 రన్స్ చేశాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు.
అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ 29 బంతులు ఆడి 49 రన్స్ చేశాడు. శుభ్ మన్ గిల్ 43 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా టోర్నీలో తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను చితక్కొట్టిన హైదరాబాద్ ఆ తర్వాత చేతులెత్తేసింది. ఇప్పటి వరకు ఆడిన ఆ ఒక్క మ్యాచ్ తప్పా అన్ని మ్యాచ్ లలో ఓటమి పాలైంది. బలమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆశించిన మేర రాణించడం లేదు. సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్ నిరాశ పరిచాడు. టోర్నీ హాట్ ఫేవరేట్ గా ఉన్న ఎస్ ఆర్ హెచ్ ఇప్పుడు ఎదురీదుతోంది.