5 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓటమి
హైదరాబాద్ – జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చుక్కలు చూపించాడు లఖ్ నవూ జట్టు ప్లేయర్ నికోలస్ పూరన్. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 191 పరుగుల లక్ష్యాన్ని సునాయసం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్ పరంగా శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషిస్తే బ్యాటింగ్ పరంగా పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నికోలస్ పూరన్ కేవలం 26 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 6 ఫోర్లు 6 సిక్సర్ల మోత మోగించాడు. 70 రన్స్ చేశాడు. మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్ లతో 52 పరుగులు చేశాడు. ఎప్పటి లాగే కెప్టెన్ రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. అనవసర షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినా ఎక్కడా తగ్గలేదు ఎల్ ఎస్ జీ.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐపీఎల్ 2025లో బలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. లఖ్ నవూ సూపర్ జెయింట్స్ దెబ్బకు విల విల లాడింది. తమకు ఎదురే లేదని విర్రవీగుతూ వచ్చిన ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లారు ఆటగాళ్లు. తుక్కు రేగ్గొట్టారు. ప్రధానంగా నికోలస్ పూరన్ విధ్వంసానికి తేలి పోయారు హైదరాబాద్ బౌలర్లు. ఉతికి ఆరేశాడు. మైదానం నలుమూలలా షాట్స్ తో విరుచుకు పడ్డాడు. ఫోర్లు , సిక్సర్లతో రెచ్చి పోయాడు. దీంతో ఓటమి తప్పలేదు ఎస్ఆర్ హెచ్ కు. 5 వికెట్ల తేడాతో ఓడించింది. తమకు ఎదురే లేదని చాటింది ఎల్ ఎస్ జె. ముందు బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు.