తేలి పోయిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు
హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన 2వ కీలక మ్యాచ్ లో అంతా అనుకున్నట్టు గానే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెచ్చి పోయింది. పరుగుల వరద పారించింది. ముంబై ఆటగాడు ఇషాన్ కిషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెంచరీతో కదం తొక్కాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు స్టాండింగ్ స్కిప్పర్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదటి నుంచే బాదడం మొదలు పెట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది ఎస్ ఆర్ హెచ్. భారీ లక్ష్యాన్ని ముందు ఉంచింది. అభిషేక్ శర్మ 24 రన్స్ చేస్తే ట్రావిస్ హెడ్ దుమ్ము రేపాడు.
64 రన్స్ చేశాడు. కిషన్ 106 రన్స్ 45 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 6 సిక్సర్లు కొట్టాడు. ఇక నితీశ్ రెడ్డి 30, క్లాసెన్ 34 పరుగులు చేశారు. స్కిప్పర్ రియాన్ పరాగ్ ఎంత మంది బౌలర్లను మార్చినా ఫలితం లేక పోయింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. హైదరాబాద్ బ్యాటర్లు ఊచకోత కోశారు. తీక్షణ, జోఫ్రా ఆర్చర్ ను ఉతికి ఆరేశారు. ఇద్దరూ 50కి పైగా పరుగులు ఇచ్చుకున్నారు. తుషార్ దేశ్ పాండే 3 వికెట్లు తీయగా సందీప్ శర్మ ఒక వికెట్ , తీక్షణ 2 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉండగా చేతికి గాయం కావడంతో రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు.