కీలక పోరుకు సిద్దమైన ఐపీఎల్ జట్లు
హైదరాబాద్ – హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా రెండో మ్యాచ్ కు సిద్దమైంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పెద్ద ఎత్తున స్టేడియంకు తరలి రానున్నారు. ఇప్పటికే మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అన్నీ అమ్ముడు పోవడం క్రికెట్ పట్ల ఉన్న ఆదరణకు అద్దం పడుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, ఐటీ, లాజిస్టిక్, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్‌య జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు పేర్కొన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇరు జట్లు అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో బలంగా ఉన్నాయి. హోరా హోరీగా జరగనుంది. ఇక ఎస్ ఆర్ హెచ్ టీంకు హోం గ్రౌండ్ కావడంతో భారీ ఎత్తున మద్దతు లభించనుంది. హైదరాబాద్ కు ప్రధాన బలం బ్యాటింగ్ లైనప్. ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే తగ్గేదే లే అన్నట్టు విరుచుకు పడడం చేస్తూ వస్తోంది. ఈసారి టైటిల్ ఫెవరేట్ గా ఉంది. ఇదే సమయంలో స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టును తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. మైదానంలో పాతుకు పోతే తనను తప్పించడం తలకు మించిన భారం అవుతుంది. ఈ టీమ్ కు అదనపు బలం రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు.