11 పరుగుల తేడాతో ఓటమిపాలు
బెంగళూరు – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో వరుస పరాజయాలకు స్వస్తి పలికింది హోం గ్రౌండ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ జట్టు బౌలర్ల దెబ్బకు ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ తలవంచక తప్పలేదు. నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 11 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ సూపర్ షో చేశారు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేశారు. 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులకే పరిమితమైంది. జైశ్వాల్ 19 బాల్స్ ఎదుర్కొని 7 ఫోర్లు 3 సిక్సర్లతో 49 రన్స్ చేశాడు. జురెల్ 3 ఫోర్లు 3 సిక్సర్లతో 47 రన్స్ చేశాడు.
విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. 70 పరుగులతో రెచ్చి పోయాడు. తను కేవలం 42 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో 8 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ టోర్నీలో వరుసగా రాణిస్తూ తనకు ఎదురే లేదని చాటుతున్నాడు రన్ మెషీన్. తనతో పాటు దేవదత్ పడిక్కల్ కూడా రెచ్చి పోయాడు రాజస్థాన్ బౌలర్లపై. తను కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. అనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఆటగాళ్లు దాడి చేయడం ప్రారంభించారు. భువీ వేసిన తొలి బింతిని సిక్సర్ కొట్టాడు జైశ్వాల్. వైభవ్ సూర్య వంశీతో కలిసి తొలి వికెట్ కు 52 రన్స్ చేశాడు. నితీష్ రాణా 28 రన్స్ చేస్తే , రియాన్ పరాగ్ 22 పరుగులకే వెనుదిరిగాడు. జురెల్ 47 రన్స్ చేసి ఆఖరులో అవుట్ కావడంతో రాజస్థాన్ పరాజయం పాలైంది.