182 మంది ఆటగాళ్లు రూ. 639.15 కోట్లు
జెడ్డాలో ముగిసిన ఐపీఎల్ మెగా వేలం
జెడ్డా – టాటా ఐపీఎల్ మెగా వేలం పాట జెడ్డాలో ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. పెద్ద ఎత్తున ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నా..చివరకు 182 మందికి మాత్రమే ఛాన్స్ దక్కింది. ఆయా ఫ్రాంచైజీలు ఏకంగా రూ. 639.15 కోట్లు వెచ్చించారు. ఇది రికార్డు ధర అని చెప్పక తప్పదు. ఇక ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు భారత క్రికెటర్ రిషబ్ పంత్ .తనను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ. 27 కోట్లకు తీసుకుంది.
ఆ తర్వాత రూ. 26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ చేజిక్కించుకుంది. వెంకటేశ్ అయ్యర్ ను రూ. 23 కోట్లు ఖర్చు చేసింది కోల్ కతా నైట్ రైడర్స్. ముంబై స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రూ. 18 కోట్లకు అమ్ముడు పోయాడు. భారీ ధర పలకడం విశేషం. రూ. 10 కోట్లకు ఇషాన్ కిషన్ ను తీసుకుంది ఎస్ ఆర్ హెచ్.
కేవలం 13 ఏళ్ల వయసు కలిగిన వైభవ్ సూర్య వంశీ వేలం పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. తనను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు తీసుకుంది. 2వ రోజు వేలం పాటలో భారత పేసర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
రూ. 10.75 కోట్లకు భువనేశ్వర్ కుమార్ ను ఆర్సీబీ తీసుకుంది. ఆకాశ్ దీప్ ను లక్నో రూ. 8 కోట్లకు కైవసం చేసుకుంది. దీపక్ చాహర్ ను ముంబై ఇండియన్స్ రూ. 9.25 కోట్లకు చేజిక్కించుకుంది. ముకేష్ కుమార్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8 కోట్లకు, తుషార్ దేశ్ పాండేను రూ. 6.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది.